AP Inter Exams | ఏపీ ఇంటర్ బోర్డు (AP Inter Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్లో ఇక మీద పరీక్షలు ఉండవని ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను (First Year Ecams) తొలగించనున్నట్లు బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.
బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 ఇంటర్ ఫస్టియర్లో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Also Read..
Ap Highcourt | గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్
Chandrababu Tweet | మీ రాకకు ఎదురుచూస్తున్నాం.. మోదీ పర్యటనపై చంద్రబాబు ట్వీట్
YS Sharmila | చంద్రబాబు గారు.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి : వైఎస్ షర్మిల