అమరావతి : రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ( Narendra Modi) రాష్ట్ర ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu ) అన్నారు. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగే కార్యక్రమం రాష్ట్రాభివృద్దిలో కీలక ముందడుగని, మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామని ట్విట్లో ( Tweet ) పేర్కొన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) , ఒడిశాలలో (Odissa) రెండు రోజుల పర్యటనపై ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలతో పాటు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసి భారతీయ దివస్ వేడుకలలో పాల్గొంటున్నానని వెల్లడించారు.
హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు,విశాఖపట్నం ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ( Green Hydrogen Mission) లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపనచేయడం సంతోషకరమైన విషయమని అన్నారు.
అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ , తిరుపతి జిల్లాలోని చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైన కృష్ణ పట్నం పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన కార్యక్రమాలలో కూడా పాల్గొంటానని నరేంద్ర మోదీ ట్విటర్లో వివరించారు .