YS Sharmila | చంద్రబాబు గారు.. ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి : వైఎస్ షర్మిల
YS Sharmila | ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో రాష్ట్ర ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటన చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదిక ద్వారా డిమాండ్ చేశారు.
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ట్విటర్ వేదిక ద్వారా డిమాండ్ చేశారు. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించాలని, విశాఖ స్టీల్ (Visaka Steel) ప్రైవేటీకరణ లేదని మోదీతో చెప్పించాలని కోరారు.
మోదీ కోసం మీరు ఎదురు చూస్తుంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని తెలిపారు. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారని మండిపడ్డారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదని ఆమె విమర్శించారు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన లేదని , 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదని, కడప స్టీల్ కట్టలేదని ఆరోపించారు. విశాఖ ఉక్కును రక్షించలేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

