Ap Highcourt | గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్
Game Changer - Daaku Maharaj | ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్.. విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పండుగ బరిలో నిలిచాయి.
Game Changer – Daaku Maharaj | ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్.. విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు పండుగ బరిలో నిలిచాయి. ఇందులో గేమ్ ఛేంజర్ మూవీ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా…ఈనెల 12న డాకు మహారాజ్ విడుదల కానుంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం వస్తుంది. ఈ సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది.
అయితే ఈ టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందులో గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలకు సంబంధించిన మూవీటీమ్లను ప్రతివాదులుగా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల పెంపు జరిగిందని…ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని పిల్లో కోరారు.
అయితే ఈ పిటిషన్‌ని నేడు విచారించిన హైకోర్టు టికెట్ల రేట్లపై సంచలన తీర్పును వెల్లడించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లను 14 రోజులు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినివ్వగా.. ఈ అనుమతిని 10 రోజులకు కుదించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం విడుదలైన 10 రోజుల వరకు పెంచిన రేట్లు అందుబాటులో ఉండనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

