బషీరాబాద్, డిసెంబర్ 24 : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని భోజ్యనాయక్తండాకు చెందిన గోవింద్, బొంరాస్‌పేట్ మండలం గౌరారానికి చెందిన గోపాల్‌నాయక్, కొర్విచేడ్కు చెందిన ఇద్దరు కౌలు రైతులు వరి, ఇతర పంటలు పండించారు. ధాన్యాన్ని విక్రయించేందుకు సహకార సంఘం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు.
ఈ నెల 20న బస్తాకు 42 కిలోల చొ ప్పున తూకం చేశారు. గోవింద్వి 363, గోపాల్నాయక్వి 309 బస్తాలు లెక్కకు వచ్చా యి. తూకం వేసిన బస్తాలను రెండు రోజులు తర్వాత అగ్గనూర్ శివారులోని ఓ రైస్ మిల్కు పంపించారు. ధాన్యం బిల్లు కోసం కొనుగోలు కేంద్రానికి వెళ్తే.. 10 బస్తాలు తగ్గించి బిల్ చేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహం చెందారు. రైస్‌మిల్‌లో తూకం తక్కువగా వచ్చినందున బస్తాలు తక్కువ చేసి బిల్ చేస్తామని నిర్వాహకులు పేర్కొనడంతో రైతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాము దోపిడీకి గురవుతున్న విష యం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు.