కాచిగూడ, జూలై 10: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 50 శాతం వరకు పెంచాలని, రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం వరకు పెంచుతామని రాహుల్‌గాంధీ వాగ్దానం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సురేశ్, పండరీనాథ్ పాల్గొన్నారు.