Rangareddy | మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని అలాగే చంపేస్తా.. ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది.
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని పోక్సో బాధితురాలిని గతంలోనే రాజ్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది. అయితే బాధితురాలు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఆరుగురి ప్రాణాలు పోయేవి కాదని బాధితురాలి కుటుంబసభ్యులు అంటున్నారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యమే ఇంతటి దారుణానికి కారణమైందని ఆందోళన చేపట్టారు.
గతంలో భూతగాదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలోనే రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2018లో సరిత అనే మహిళను రాజ్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ మరో మైనర్ బాలికను ప్రేమ పేరుతో రాజ్‌కుమార్ వేధించసాగాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి ఆమెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచింది. ఈ క్రమంలో ఒకసారి పరీక్షల కోసం బాలిక కాలేజీకి వెళ్లినప్పుడు.. ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించాడు. అప్పుడు ఆమె తల్లి చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి నుంచి బాలికను తప్పించింది.
పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు ప్రధాన కారణం!
ప్రేమ పేరుతో బాలికను వేధించడంతో రాజ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు
షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన నిందితుడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
గతంలో భూతగదాలో ఇద్దరిని బెదిరించినందుకు రాజ్ కుమార్‌పై రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు సమాచారం
2018లోనే… https://t.co/5aAOYCOd1F pic.twitter.com/Yl94JeX4cq
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
అప్పటి నుంచి బాలికపై రాజ్‌కుమార్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ నాన్నను ఎలా చంపేశారో.. మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించాడని అంటున్నారు. అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నా.. పోక్సో కేసు నమోదైనప్పటికీ బాలికకు ఎలాంటి రక్షణ కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఉదందతానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.
మరోవైపు పోక్సో కేసులో కేవలం ఏడేళ్లు మాత్రమే శిక్షపడేలా తేలికపైన సెక్షన్లను పోలీసులు జత చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల కేవలం రూ.20వేల పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ వచ్చిందని.. దీనివల్లే బయటకు వచ్చిన రాజ్‌కుమార్ ఆరుగురిని కిరాతంగా హత్య చేశాడని స్థానికులు మండిపడుతున్నారు.
పోక్సో బాధితురాలికి, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు
మీ నాన్నను ఎలా చంపేశారో, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్
అయితే బాధితులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
ఫిర్యాదు చేసిన… https://t.co/cyHvNEi9m3 pic.twitter.com/39e5KvrdyX
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

