Leopard | మెదక్ జిల్లాలో బర్రెపై దాడి చేసి చంపిన చిరుతపులి..
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Leopard | మెదక్ : మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
తొణిగండ్ల గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో కొత్తగారి రమేశ్ అనే రైతు బర్రెను కట్టేశాడు. శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లి చూడగా బర్రె చనిపోయి ఉంది. దీంతో రమేశ్ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చనిపోయి పడి ఉన్న బర్రెను పరిశీలించారు.
చిరుత పులి దాడిలో బర్రె చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు, పోలీసులు నిర్ధారించారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సమీప అడవుల్లోకి ఎవరూ కూడా ఒంటరిగా వెళ్లొద్దని పోలీసులు సూచించారు. చిరుత పులి జాడలు కనిపిస్తే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Army jawan | అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
SCR | ఆగస్టు 5 నుంచి 10 వరకు ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ల రద్దు.. ఎందుకంటే?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

