హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తాను పార్టీ ఫిరాయించలేదని బుకాయిస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి శాసన మండలి భవనం పనులను పరిశీలించారు. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ సమయం స్పీకర్, చైర్మన్, సీఎంతో కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యే యాదయ్య మండలి భవనం పనులను పరిశీలించడం గమనార్హం. కాగా వచ్చే శాసనమండలి సమావేశాలను పునరుద్ధరించిన భవనంలోనే నిర్వహించేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.