హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటుచేశారు.
రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు కావడం, కొందరు దాఖలుకు సిద్ధమైన క్రమంలో తక్షణ న్యాయసలహాలు, సూచనలు ఇచ్చేందుకు ముగ్గురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో పీఆర్ఆర్డీ శాఖ లీగల్ సెల్‌ను ఏర్పాటుచేస్తూ ఆ శాఖ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు ఇచ్చారు.