కాగజ్‌నగర్, జనవరి 16 : బీఆర్ఎస్ను వీడుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్త చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని సూచించారు.