హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సమాధాన పత్రాల మూ ల్యాంకన విధులకు లెక్చరర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొన్నారు. లెక్చరర్లను రిలీవ్ చేయని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ జిల్లాలోనే 125 మంది కాలేజీ ప్రిన్సిపాళ్లకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) గడ్డెన్న షోకాజ్ నోటీసులిచ్చారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగతా జిల్లాల్లోనూ మూల్యాంకనానికి డుమ్మా కొట్టగా, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీచేశారు. నోటీసు అందిన ఒకరోజు వ్యవధిలోనే సమాధానం చెప్పాలని ఆదేశించారు.