Komuravelli Mallanna | పసుపు బండారి కోసం ఎగబడ్డ భక్తులు.. పోలీసుల లాఠీచార్జ్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో (Komuravelli Mallanna) స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లింగోద్భవ కాలంలో ప్రారంభమైన పెద్దపట్నం.. శనివారం వేకువజాము వరకు కొనసాగించారు. ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పట్నం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారు పట్నం దాటిన అనంతరం భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పసుపు బండారి కోసం భక్తులు ఎగబడ్డారు. పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెల పైనుంచి దూకారు. దీంతో వారిని వారించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో తమ లాఠీలకు పనిచెప్పారు. మహిళా భక్తులపై లాఠీచార్జ్ చేశారు.





Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

