ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు స్థలం కేటాయించాలి
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
- కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 450 ఎకరాల స్థలాన్ని అప్పగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌లతో సమీక్షించారు. అనంతరం రామ్మోహన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒకే విమానాశ్రయం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లోనూ విమానాశ్రయాలు ఉండాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. వరంగల్‌లో విమానాశ్రయానికి అడుగులు వేస్తున్నామని, మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్‌లో 360 ఎకరాలకు సంబంధించిన డిఫెన్స్ స్థలంలో విమానాశ్రయం నిర్మించాలనుకున్నామని, అదనంగా మరో 450 ఎకరాల స్థలం అవసరముందని చెప్పారు. పౌర విమానయాన, రక్షణశాఖలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న క్షేత్రస్థాయిలో ఓఎల్ఎస్(అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్వే) చేసిన తర్వాత రన్‌వే ఓరియెంటేషన్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రక్షణశాఖ మాస్టర్ ప్లాన్‌కు అంగీకారం తెలిపాక శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

