హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త స మావేశం నిర్వహించారు. నేతలు మా ట్లాడుతూ.. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1న ‘బ్లాక్డే’ నిర్వహించడంతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
కలెక్టర్ కార్యాలయాలు, పట్టణ, మండల, పా రిశ్రామిక ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు, జెండాలు చేతబట్టి నిరసనల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, ఆర్డీ చంద్రశేఖర్, బాలరాజు, పాలడుగు భాస్కర్, రెబ్బా రామారావు, కే సూర్యం, శ్రీనివాస్, జీ రాంబాబుయాదవ్, భరత్, ఎంకే బోస్ తదితరులు పాల్గొన్నారు.