చివరి విత్తనం
మట్టిని చేతిలో పట్టుకున్నప్పుడు అతడు భూమిని కాదు అతను తన హృదయాన్నే తాకుతున్నాడు విత్తనం వేస్తున్నప్పుడు పంట కోసం కాదు ప్రాణం నిలిచే ఆశ కోసం వేస్తున్నాడు
మట్టిని చేతిలో పట్టుకున్నప్పుడు
అతడు భూమిని కాదు
అతను తన హృదయాన్నే తాకుతున్నాడు
విత్తనం వేస్తున్నప్పుడు
పంట కోసం కాదు
ప్రాణం నిలిచే ఆశ కోసం వేస్తున్నాడు
కాలం అతన్ని దాటిపోతోంది
నగరాల కాంతులు
అతని నీడను మింగేస్తున్నాయి
కానీ అతని అడుగు
భూమిలో వేర్లలా పాతుకుపోయి
ఇంకా మట్టిలోనే ఉంది
రైతు అనే పదం
ఇప్పుడొక జ్ఞాపకమవుతుంటే
అతను మాత్రం
ఆ జ్ఞాపకాన్ని శ్వాసలా చేసుకుని బతికిస్తున్నాడు
వాన రాకపోయినా
అతను ఆకాశాన్ని నిందించడు
ఇంకోసారి ప్రయత్నిద్దాం అని
మనుషుల్ని కాదు
నిశ్శబ్దంగా మట్టిని నిమురుతాడు
ఒకరోజు అతని చేతుల నుంచి
విత్తనాలు జారిపోతాయి
అది ఓటమి కాదు
స్వార్థం గీసిన గీత
ఇప్పుడు పొలాలు ఉన్నాయి
కానీ రైతు లేడు
విత్తనాలు ఉన్నాయి కానీ ఆశ లేదు
చివరికి గాలి నెమ్మదిగా అడుగుతుంది
మనిషి మట్టిని వదిలేశాడా?
లేదా మట్టి మనిషినా?
చివరి విత్తనం
మట్టిలో కాదు..మనసులో పడాలి
అప్పుడు మాత్రమే
రైతు మళ్లీ పుడతాడు
-వారాల ఆనంద్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

