ఎంపీ వేం నరేందర్‌రెడ్డితో కార్మిక నేతల భేటీ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమ్మె నోటీసులపై ఆర్టీసీ యాజమాన్యం సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత జఠిలమైందని నేతలు వాపోయారు. ఈ మేరకు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు ఐఎన్టీయూసీ నేతలు తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్కను కలిసి, చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మిక సమాఖ్య నేతలు కే రాజిరెడ్డి నాయకత్వంలో వేం నరేందర్‌రెడ్డిని కలిసి, కార్మికుల సమస్యలు విన్నవించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్‌గౌడ్‌కు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు ఆర్డీ చంద్రశేఖర్, రాజిరెడ్డి, నాగన్న, జకుల మల్లేశంగౌడ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

