హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం ఆయన లేఖ రాసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామని, డిస్మిస్ చేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్తు కార్మికుల సమస్యలను సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమణకు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.