హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా బీజేపీ పుంజుకుంటున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులు, లౌకికపార్టీలు ఇండియా కూటమిగా ఏకమై బీజేపీ బలాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు.
బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో బీజేపీ మరింత రెచ్చిపోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల పట్ల మంత్రులు, అధికారుల వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.