హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఒక తాచు పాములాంటిదని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు కాంగ్రెస్ చేరుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించడంమంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. సన్న బియ్యం పండించేందుకు అన్ని భూములకు అనుకూలంగా ఉండబోవని, అందుకే దొడ్డు బియ్యం వైపు మళ్లాల్సి వస్తుందని, దీనిని ఎలా పరిషరించాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.