హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరును పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నది.
ఈ మేరకు సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కూనంనేనికి సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, మరో నేత సయ్యద్ అజీజ్ పాషా బీఫామ్ అందజేశారు.