KTR | నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇవ్వనున్నారు. మేజిస్ట్రేట్ శ్రీదేవి ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడైన కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్ వాం గ్మూలాలను సైతం కోర్టు రికార్డు చేయనుంది. మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరై తన మీద దాఖలైన ఆరోపణల గురించి వివరణ ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పి స్తూ కోర్టు నోటీసుల్ని జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ఆమెను బుధవారం కోర్టుకు హాజరుకావాలని లంగర్‌హౌజ్ పోలీసులు సమన్లు జారీ చేశారు.