మహబూబ్‌గర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు గిరిజనుల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని నిరసిస్తూ.. గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడాన్ని నిలదీస్తూ లగచర్ల బాధితులకు అండగా నిలిచేందుకు నిర్వహించే ‘లగచర్ల లడాయి’కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాలమూరుకు రానున్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గిరిజన నేతలతో సమావేశమయ్యారు. లగచర్ల లడాయికి ప్రభు త్వం అనుమతిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.