హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని(Nagam Janardhan Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆర్(KTR) పరామర్శించారు. కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకొని నాగంను పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్
ఆరోగ్య సమస్య అనంతరం కోలుకుంటున్న నాగం జనార్ధన్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. pic.twitter.com/LhgrFUxf0o
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024