KTR | కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి..కేంద్ర రైల్వే మంత్రికి కేటీఆర్ లేఖ
‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
- సికింద్రాబాద్‌పై మోయలేని భారం.. వికేంద్రీకరణే పరిషారం
- 900 కి.మీ. పరిధి ఉన్న గుంటూరును ప్రత్యేక డివిజన్ చేశారు
- అంతకు మించి నెట్వర్క్ ఉన్న కాజీపేటపై ఎందుకు నిర్లక్ష్యం?
- కేంద్ర రైల్వే మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
- మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు అందజేసిన పార్టీ ఎంపీల బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘కేవలం 900 కిలోమీటర్ల పరిధి కలిగి ఉన్న గుంటూరును ప్రత్యేక రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంతకంటే ఎకువ కిలోమీటర్ల నెట్వర్ ఉన్న తెలంగాణలోని కాజీపేటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వేసేవలు మెరుగుపడి, ప్రాంతీయ అభివృద్ధి సమతుల్యంగా జరిగేందుకు కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటుచేయాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కోరారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్‌పై ఆర్థికభారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతున్నదని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ రాశారు. పార్టీ ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారు. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉన్నదని, భవిష్యత్తులో ఇది 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక డివిజన్‌కు ఉండాల్సిన పరిమితి కంటే ఇది చాలా ఎకువని, దీనివల్ల నిర్వహణ భారం గా మారి భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.
2,000 కిలోమీటర్ల మేర ట్రాక్
ప్రతిపాదిత కాజీపేట డివిజన్లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా 2,000 ట్రాక్ కిలోమీటర్ల మేర సమర్థవంతమైన పాలన అందించవచ్చని కేటీఆర్ సూచించారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు, ధాన్యాల రవాణా ద్వారా ఈ ప్రాంతం నుంచి రైల్వేకు భారీ ఆదాయం లభిస్తున్నదని, ఇంతటి ప్రాధాన్యం గల మార్గాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. కాజీపేట ఇప్పటికే రైల్వేహబ్గా మారుతున్న తరుణంలో, డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదమవుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

