KTR | భారీ వర్షాల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ముందుగా సిరిసిల్ల జిల్లాలోని నర్మాలలో, అనంతరం కామారెడ్డిలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లకు బయలుదేరారు. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ నాయకులు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.