అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో జూలై 25వ తేదీన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలును పోలీసులు అవమానించారు. నిరసన తెలుపుతున్న సాయిలును దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి పోలీసులు వాహనం ఎక్కించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత నాయకుడిపై దౌర్జన్యాన్ని అప్పట్లో అందరూ ఖండించారు. కాగా, తాజాగా సాయిలుకు మద్దతుగా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సాయిలును సత్కరించారు.