KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీకి బయల్దేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని ఈ బృందం కలవనుంది. ఈ బృందంలో కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇంచార్జి జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీని పునరుద్ధించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ బృందం కోరనుంది. ఈ మేరకు కేంద్రమంత్రికి వారు వినతిపత్రం అందజేయనున్నారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించే మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.