KTR | నల్గొండ జిల్లాలో యూరియా కోసం ప్రశ్నించిన గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా కోసం ఆందోళన చేస్తే నడవరాకుండా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని.. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌కు వెళ్తామని తెలిపారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. అందులో ఒకటి మనం చెప్పుకోలేదని అన్నారు. మనది మనం ప్రచారం చేసుకోలేదని చెప్పారు. ఈ ఓటమిలో మన లోపమే ఉందని.. నాయకుడి లోపం లేదని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరూ పనిచేయనంత అద్భుతంగా మన నాయకుడు కేసీఆర్ పనిచేశారని పేర్కొన్నారు. ఇంటింటికీ నీళ్లు తెచ్చిండు.. సంక్షేమాన్ని చూపించిండు.. అద్భుతమైన అభివృద్ధి చూపెట్టిండని అన్నారు. అయినప్పటికీ 39 సీట్లకే ఎందుకు పరిమితమయ్యామనే దానిపై విశ్లేషించుకోవాలని సూచించారు. అంతర్మథనం చేసుకోకుండా.. అంతా బాగుందని జబ్బలు సరుచుకుని తిరగవద్దని చెప్పారు.
ఎన్నికల్లో అప్పుడుప్పుడు గెలుస్తుంటాం.. అప్పుడప్పుడు ఓడిపోతుంటామని కేటీఆర్ తెలిపారు. అయితే మనకంటే మెరుగైన పరిపాలన, సంక్షేమం అందించే వారి చేతిలో ఓడిపోతే బాధ అనిపించందని.. కానీ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందని అడిగారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారని.. యూరియా కోసం మళ్లీ క్యూలైన్లలో నిలబడే దుస్థితి వచ్చిందని వాపోయారు. నల్గొండలో యూరియా కావాలని లంబాడా సోదరుడు ఆందోళనలో పాల్గొంటే.. ఆయన్ను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లలో పెట్టి థర్డ్ డిగ్రీ ఇచ్చారని మండిపడ్డారు. ఉల్టా ఆయనపై కేసు పెట్టి.. ఇంటికెళ్లి భార్యను బండబూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన నడవరాక కుంటుకుంటూ తిరిగే దుస్థితి వచ్చిందన్నారు. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో చూసి.. ఆ పిల్లాడిని పలకరించి ధైర్యం చెప్పి రమ్మని జగదీశ్ రెడ్డికి చెప్పానని అన్నారు. దీనివెనుక ఉన్న ఎవరినీ వదిలిపెట్టవద్దని జగదీశ్ రెడ్డికి తెలిపానని అన్నారు. అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌కు వెళ్దామని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెళ్తామని తెలిపారు.
నల్గొండలో యూరియా కోసం ధర్నా చేసిన యువ గిరిజన రైతుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు
కులం పేరుతో తిట్టి, ఇంట్లో నుండి లాక్కెళ్లి కొడితే ఆ యువకుడు నడవలేని స్థితిలో ఉన్నాడు
దీనిపై మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం.. దీని వెనకున్న ఎవరిని వదిలిపెట్టం – కేటీఆర్ https://t.co/JoCKfIm9R5 pic.twitter.com/JIcuD0Wjk8
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025
రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో రైతులు సుభిక్షంగా ఉండేవారని, ఆటోవాళ్లకు చెప్తే.. వాళ్లే ఇంటి ముందు యూరియా బస్తా వేసి వెళ్లేవారని గుర్తుచేశారు. పాతరోజులు తీసుకొస్తానని రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు.. అన్నట్లే పాత రోజులు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. యూరియా కోసం చెప్పుల క్యూలైన్లు, తన్నుకునుడు, గుద్దుకునుడు, పోలీసులు కొట్టడం వంటివి మళ్లీ మొదలయ్యాయని అన్నారు. రైతులను పోలీసులు పొట్టు పొట్టు కొట్టుడేనా రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బతీన్కా దుఖాన్ అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వరంగల్‌కు వచ్చినప్పుడు కిసాన్ డిక్లరేషన్ ప్రకటించారని గుర్తుచేశారు. కేసీఆర్ రైతుబంధు 10 వేలు ఇస్తే.. మేం 15 వేలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే మేం మూడు పంటలకు ఇస్తామని తెలిపారు. పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఎరువులు, విత్తనాలు ఇస్తామని, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇన్ని చెప్పి ఇప్పుడు రైతుల మీద పడి పోలీసులు కొడుతున్నారని అన్నారు. ఇది కాంగ్రెసోళ్ల నీతి అని మండిపడ్డారు.
లంబడీ ల** కొడకా అని తిడుతూ 25 నిమిషాలు రబ్బర్ బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు
నల్గొండ జిల్లాలో యూరియా కోసం ధర్నా చేసిన గిరిజనుడుపై పోలీసుల థర్డ్ డిగ్రీ
25 నిమిషాలు విచక్షణారహితంగా కొట్టి, కుంటుకుంటూ నడిచినా, ఎవరికైనా చెప్పిన బెయిల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని… https://t.co/Mk0iJa4ei5 pic.twitter.com/8in2DE2Rxz
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025