Telangana | అంగన్వాడీలను సకల సౌకర్యాలతో ప్రీస్కూళ్లుగా మారుస్తామంటూ సర్కార్ చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా క్షేత్రస్థాయి దుర్భర దృశ్యమిది. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతంలో పందులు తిరుగాడుతుంటే.. బిక్కు బిక్కుమంటూ భోజనం కోసం పిల్లలు క్యూలైన్లో నిలబడ్డారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఇవాళ ఈ ఫొటో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యారంంపై జరుగుతున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగి 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారని.. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.