KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
KTR | తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు
KTR | తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధుతో పాటు యాసంగి పంటకు సంబంధించిన మరో విడతను కలిపి మొత్తం ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరం గంగ ప్రవహిస్తోందని, ఈ సమయంలోనూ 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే ఇప్పటికీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నీటిని ఎత్తిపోసే ఆలోచన లేదని విమర్శించారు. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, పంటలు పండితే వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని, కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని రిటైర్డ్ ఇంజినీర్లు ముఖ్యమంత్రికి లేఖ రాశారని కేటీఆర్ పేర్కొన్నారు. నీటిని ఎత్తిపోసే విధానాన్ని చూపిస్తామని కూడా వారు చెప్పారని వివరించారు. అయితే వారి సూచనలను స్వీకరించకుండా ముఖ్యమంత్రి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వీళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని.. చర్లపల్లి జైల్లో పెట్టాలని అన్నాడని చెప్పారు. వీళ్లను పొట్టు పొట్టు కొట్టేటోడు లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్ల మాట విని జులైలోనే నీటిని ఎత్తిపోసి ఉంటే ప్రస్తుత కరువు పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు. ఇవాళ కరువు వచ్చింది కదా.. ఎవరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రశ్నించారు. నీళ్లు ఎత్తిపోయకుండా వ్యవసాయాన్ని ఆగం చేసి, కరువు తెచ్చిన కాంగ్రెస్‌కు బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని చెనాకా-కొరాట ప్రాజెక్టు పనులను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని దశాబ్దాల కలను సాకారం చేశామని, ప్రాజెక్టు ట్రయల్ రన్ కూడా పూర్తిచేశామని చెప్పారు. అయితే మూడేళ్లు గడిచినా పంపిణీ కాలువల పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. కాలువలు తవ్వితే ఆదిలాబాద్ రైతులకు సాగునీరు అందుతుందని, ప్రభుత్వం ఈ పనులపై నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలోనూ ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం మూడేళ్లు పట్టిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ఇదంతా కేవలం డ్రామా మాత్రమేనని.. ప్రజలను మభ్యపెట్టేందుకే అని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Congress
- KTR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

