KTR | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
మంత్రి అక్రమ మైనింగ్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీలో ఆధారాలతో సహా హరీశ్‌రావు బయటపెట్టారని తెలిపారు. మంత్రి స్కామ్ బయటపెట్టేసరికి.. కాంగ్రెస్ ప్రభుత్వం బిత్తరపోయిందని అన్నారు. అక్రమాలు జరిగింది వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి దూరపు బంధువులదంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధం ఉందని కేటీఆర్ ఆరోపించారు. అందుకే పొంగులేటిని రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడని అన్నారు. తప్పు చేయకపోతే భయమెందుకు అని ప్రశ్నించారు. మంత్రి కుటుంబాన్ని సీఎం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వందల కోట్ల ప్రజాధనాన్ని మంత్రి పొంగులేటి కంపెనీ కొల్లగొడుతుందని కేటీఆర్ తెలిపారు. కోకాపేటలో భాగ్యలక్ష్మీ మైనింగ్ అని మరో కంపెనీ సీఎం దగ్గర బంధువుది అని అన్నారు. సీఎం బామ్మర్ది రమేశ్ రెడ్డి భాగ్యలక్ష్మీ మైనింగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు. మైనింగ్ పేరుతో రూ.900 కోట్ల అవినీతి జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో బయటకు రావాలన్నారు. హౌస్ కమిటీ వేసేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నిలదీశారు. స్కామ్‌లు బీఆర్ఎస్ బయటపెడుతుంటే బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటు భూముల్లో గూండాలను వేసుకుని కబ్జా చేస్తున్న దాన్ని కూడా వదిలిపెట్టమని అన్నారు.
గత రెండేండ్ల నుండి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ..
మంత్రి పొంగులేటికి చెందిన మైనింగ్ సంస్థ వందల కోట్ల రూపాయల సొమ్మును పోగు చేసుకుంది.మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రకారం..
ఈ ప్రభుత్వానికి రూ. 1800 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా…
వచ్చింది కేవలం రూ. 900 కోట్లు… pic.twitter.com/IR2KTCK0iv— BRS Party (@BRSparty) March 29, 2026