KTR | నీ రూ.1.50లక్షలకోట్ల మూసి ధన దాహానికి నగరంలో లక్షల జీవితాలో బలవుతున్నాయ్ మిస్టర్ చీప్ మినిష్టర్ అంటూ సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం గుండెలు పగిలి, గూళ్లు చెదిరి.. ఆడబిడ్డల ఆవేదనలు, ఇంటిపెద్దల శాపనార్దాలతో నగరం రోధిస్తుందన్నారు. రెక్కలు, ముక్కలు చేసి కలల కుటీరాలను నిర్మించి కన్న బిడ్డలకు ఇవ్వలేకపోతున్నా అని ఒక తల్లి.. అమ్మలాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు ఎలా పోతాం అంటూ మరో తండ్రి గుండెలు బాదుకుంటున్నారన్నారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమో అని ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న చేసుకుందని. భార్య కడుపుతో ఉన్నా కనికరించరా అంటూ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడన్నారు.
నాడు రైతుల ప్రయోజనం కోసం 30వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగోడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి ఇప్పుడు ఎక్కడ పన్నావ్ అంటూ ధ్వజమెత్తారు. నాడు ఆలా నేడు ఇలా.. నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావ్ అని మరోమారు నిరూపించావ్ అంటూ ఘాటుగా స్పందించారు. మహా నగర ప్రజలు అధైర్యపడొద్దు ఇప్పుడు జరుగుతున్న ఈ ధ్వంసంలో తొందరపడి మీ ప్రాణాలను బలితీసుకోవద్దన్నారు. న్యాయ స్థానాలు ఉన్నాయని.. మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ, తాము ఉన్నామని ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ కోలుకున్నారు. సోమవారం నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించనున్నారు.