KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదు.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ. ఈ పార్టీ మరో 75 ఏండ్ల పాటు ఒక డీఎంకే లాగా, శిరోమణి అకాలీదళ్ లాగా ఉంటది. ఈ పార్టీ మన తెలంగాణ ప్రజలది అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో మనం జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్‌నే శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్ పార్టీ బీజేపీనే. మతాలను అడ్డంపెట్టుకుని, మతపరమైన రాజకీయాలు చేస్తూ.. దేవుడిని అడ్డుపెంట్టుకుని పిల్లలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణకు చేసిందేమీ లేదు బీజేపీ. ఐఐటీ, ఐఐఎం, మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు. ఆఖరికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. తెలంగాణకు ఏం ఇచ్చారని అడిగితే ఎవరు చెప్పరు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు మాటలు రావు. కానీ పిల్లలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. మండలం, నియోజకవర్గం స్థాయిలో కమిటీలు వేసుకుందాం. సమర్థవంతమైన విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని జిల్లాలకు పంపుదాం. మండల కమిటీ, కాలేజీ కమిటీలను భర్తీ చేసి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసుకుందాం. ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలక పాత్ర పోషించాలి. కేసులకు భయపడొద్దు.. లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తున్నాం. విద్యార్థి నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. బీఆర్ఎస్వీ లేని కాలేజీ ఉండొద్దు. విద్యార్థి నాయకులకు రాజకీయంగా అవకాశాలు ఇస్తాం. మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు ఇతర పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక
బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదు.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక pic.twitter.com/eRZSy7lGeE
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రశ్నించడం బంద్ అయితే.. తెలంగాణ మూగబోతది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే.. నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR | పోరాటాలు మనకు కొత్త కాదు.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు : కేటీఆర్