KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బంద్ అయితే.. సమాజం తరపున కొట్లాడడం బంద్ అయితే.. పేద ప్రజల తరపున మాట్లాడడం బంద్ అయితే తెలంగాణ మూగబోతది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీజేపోడు మాట్లాడడు. తెలంగాణన నాశనం చేసిన బీజేపోడు మెసలడు. బడే భాయ్ చోటే భాయ్ ఒక్కటే. పైననేమో జూమ్లా పీఎం.. ఇక్కడ్నేమో హౌలా సీఎం.. ఈయనకు ఏం తెల్వది.. ఆగమాగం అవుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఓ బిల్డర్ తనకు వద్దకు వచ్చి.. హైదరాబాద్‌లో అతిపెద్ద బిల్డింగ్ కట్టాను.. కానీ 8 ఏండ్లలో మున్సిపల్ మంత్రిగా ఉన్న మిమ్మల్ని కలిసే అవసరం రాలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి కలుస్తున్నాను. అప్పుడు కేసీఆర్ భయంతో అధికారులు పని చేసేవారు.. మంత్రులను కలిసే పరిస్థితి రాలేదు. కానీ ఇప్పుడు కరెంట్ కనెక్షన్ కోసం ఫోన్ చేసినందుకు రూ. 25 లక్షలు తీసుకున్నారట. ఈ విషయాన్ని సదరు బిల్డర్ చెప్పి బాధపడినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
గత పది నెలల్లో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ప్రతిపక్షంలో కూర్చుంటామని ఊహించలేదు. డిసెంబర్ 7న కేసీఆర్‌కు ప్రమాదం జరగడం.. మూడు నెలల పాటు ఇబ్బందికి గురయ్యారు. ఓ పది మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలతో దొంగల్లో కలిసిపోయారు. మన ఆడబిడ్డ కవితమ్మను ఐదున్నర నెలలు జైల్లో పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్లాడినం, పోరాడినం కానీ ఎవరికీ లొంగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చాయి. ఇవాళ కేసీఆర్‌ను తలచుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు, బతుకమ్మ చీరలు వస్తుండే అని అనుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా కేసీఆర్‌ను తలచుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బతుకమ్మ చీరలపై మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్
KTR | పోరాటాలు మనకు కొత్త కాదు.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు : కేటీఆర్
KTR | చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే.. నిప్పులు చెరిగిన కేటీఆర్