Harish Rao | బతుకమ్మ చీరలపై మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఫైర్
Harish Rao | కేసీఆర్ ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు బంద్ చేసిందన్న దానికి సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఆ బతుకమ్మ చీరలతో ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరలు మాయమయ్యాయి. బతుకమ్మ చీరలపై ప్రజలు ప్రశ్నిస్తే.. మంత్రులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు.
కేసీఆర్ ఏటా ఇచ్చే బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎందుకు బంద్ చేసిందన్న దానికి సమాధానం చెప్పకుండా మంత్రి సీతక్క పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మా ప్రభుత్వం ఏటా రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిందని ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అని సీతక్కను ఉద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
ఒక్కోక్కరికీ రూ. 25,000 వేలు బాకీ
అయితే అంతకు మించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించినట్లు భ్రమలు కలిపించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు అమలు చేయకుండా, ప్రచారం కోరుకోవడం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు అలవాటుగా మారింది. మహాలక్ష్మి పథకానికి ఈ రాష్ట్రంలోని రేషన్ కార్డు కలిగి ఉన్న 93 లక్షల కుటుంబాలలో 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళను అర్హులుగా తీసుకున్నా.. 10 నెలలుగా నెలకు రూ. 2,500 చొప్పున 93 లక్షల మహిళలకు ఒక్కోక్కరికీ రూ. 25,000 వేలు బాకీ పడ్డారు. అంటే మొత్తం రూ. 23,250 కోట్లు. మహాలక్ష్మి అమలు చేయకుండా మోసం చేయడమే కాకుండా రూ. 3,325 కోట్ల లెక్క చెప్పి, చెల్లించాల్సిన రూ. 23,250 కోట్లు కప్పి పుచ్చారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత..
ఇది కాకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులకు అదనంగా తులం బంగారం ఇస్తామని మాట తప్పారు. రూ. 500 గ్యాస్ పథకం, 200 యూనిట్ల గృహజ్యోతిని కొందరికే పరిమితం చేశారు. హామీల అమలు విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. ఇక మహిళల గౌరవాన్ని నిలబెడుతున్నట్లు చెప్పిన మీ మాటలు అటుంచితే, ముందు మహిళల ప్రాణాలు కాపాడాలని, శాంతి భద్రతలు నిర్వహించి వారి భద్రతకు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎస్ ఆదేశం
KTR | చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే.. నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR | పోరాటాలు మనకు కొత్త కాదు.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

