Group-1 Mains | గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎస్ ఆదేశం
Group-1 Mains | ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Group-1 Mains | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు, సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ఎస్పీడీసీఎల్ ఎండీ ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎస్ శాంతి కుమారి.
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండడంతో.. పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | పోరాటాలు మనకు కొత్త కాదు.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు : కేటీఆర్
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..
KTR | పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్ ఫైర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alias Rukmini Trailer | పగలు కోర్టులో స్టెనోగ్రాఫర్, రాత్రి రొమాంటిక్ రచయిత.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్!
Bomb Cyclone effect | బాంబ్ సైక్లోన్‌తో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు..!
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

