KTR | హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీ.. ఫోర్త్ సిటీ పేరిట రేవంత్ సర్కార్ పేదల భూములపై కన్నేసింది. ఫోర్త్ సిటీ మాటున వేల ఎకరాలు గుంజుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. అడ్డగోలు అలైన్మెంట్తో.. పేదల అనుమతి లేకుండా… వారి భూములను స్వాధీనం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై బాధిత గ్రామాల ప్రజలు, రైతులు కన్నెర్ర జేస్తున్నారు.
అయితే రంగారెడ్డి జిల్లా వెల్దండ, మాడ్గుల మండలాల్లోని కుందారం భూములపై అరాచకకాండ రాజ్యమేలుతున్నదని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అది ఫోర్త్ సిటీ కాదు.. అది ఫోర్ బ్రదర్స్ సిటీ అని కేటీఆర్ ఎద్దెవా చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా అనే హ్యాష్ ట్యాగ్ జతపరిచారు కేటీఆర్.
మారిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్తో లబ్ధి పొందేందుకు వీలుగా 400 ఎకరాలను చెరపట్టడమే లక్ష్యంగా దళారీ దందా సాగుతున్నది. ఓ కీలకనేత సోదరులు, సంబంధీకులూ వీరిలో ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘భూములిస్తారా.. మేమే లాక్కోవాల్నా’ అని రైతులను బెదిరించి ఇప్పటికే అడ్డికి పావుసేరుగా వంద ఎకరాలు కొనేశారు. ‘కబ్జా స్వాధీనపత్రం’ అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని పత్రాలపై సంతకాలు చేయించుకుని ప్రైవేటు ఒప్పందాలు చేసుకుంటున్నారు. నయీం అనుచరులను దింపి మాట వినని రైతులను బెదిరిస్తున్నారు. అజలాపురం నుంచి కుందారం తండా దాక ఇదే భయానక వాతావరణం!
కుందారం భూములపై కన్నేసిన ‘బిగ్-బ్రదర్స్’ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పు చేశారు. దీంతోపాటు ఆమనగల్-రావిర్యాల గ్రీన్ఫీల్డ్ 300 ఫీట్ల రహదారిని కూడా దీనికి సమీపంలోనే ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మరోవైపు కొందరు వ్యక్తులను రంగంలోకి దించి పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇందులోనే నయీం అనుచరులు కీలకపాత్ర పోషిస్తున్నట్టు గ్రామస్తులు కొందరు తెలిపారు. ముఖ్యంగా ఓఆర్సీ, పాసు పుస్తకాలు లేకుండా కబ్జాలో ఉన్న రైతులను ముందుగా టార్గెట్ చేశారు. ‘ఎలాగూ మీకు డాక్యుమెంట్లు లేవు… ఎంతోకొంతకు అమ్ముకుంటే ఇప్పుడు పైసలొస్తయి. లేదంటే భూమి నుంచి వెళ్లగొడ్తరు. మేం ఎలాగోలా సీసీఎల్ఏలో రికార్డుల్లో నమోదు చేసుకుంటాం’ అని చెప్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
భూములియ్యబోమని మొండికేసినవారిని బెదిరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఎకరా రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకు ధర పలుకుతుండగా… కేవలం రూ.3-4 లక్షలకే కొనుగోలు చేసుకొని, ప్రైవేటు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆపై ఓఆర్సీ ఉండి, భూమిపై ఉన్న వారిని కూడా బెదిరిస్తున్నారు. రికార్డుల్లో తక్కువ ఉండి, కబ్జాలో ఎక్కువ ఉన్నందున మొత్తానికి ఒక రేటు నిర్ధారించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు వందెకరాలకు పైగా భూమిని ఇలా కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఓఆర్సీ ఉండి పాసు పుస్తకాలు లేకుండా, కబ్జా మీద లేనివారు ఇప్పుడు వీరిచుట్టూ తిరుగుతున్నారు. మాకు ఓఆర్సీ ఉంది.. పైసలు మాకియ్యాలి అంటూ వేడుకున్నా కనికరించడంలేదని కొందరు రైతులు ‘నమస్తే తెలంగాణ’తో ఆవేదన వ్యక్తంచేశారు.
It’s not 4th City
It’s 4 Brothers’ City#RealEstateMafia https://t.co/FgS4pA13y0
— KTR (@KTRBRS) September 20, 2024
ఇవి కూడా చదవండి..
RRR Survey | దొంగ రాత్రి వేళ పల్లెల మీద డ్రోన్ల సర్వే..! రైతులకు తెలియకుండా పొలాల్లో హద్దురాళ్లు..!!
RRR | ఆమనగల్లుకు 300 ఫీట్ల రోడ్డు..? భారీ రియల్ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయా..?
RRR | ఈ ఊరు మాయమైతున్నది..! గుడితండా గుండెపై ట్రిపుల్ ఆర్ పిడుగు..!!