KTR | హైదరాబాద్ : ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో (World Boxing Cup Finals) పసిడి పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గురువారం జరిగిన మహిళల 51కిలోల ఫైనల్ పోరులో యువ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0 తేడాతో గువో యి జువాన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించిందని కేటీఆర్ ప్రశంసించారు. మీ అవిశ్రాంత కృషి, అజేయ స్ఫూర్తి భారతదేశం, తెలంగాణను గర్వపడేలా చేస్తూనే ఉన్నాయని కొనియాడారు. నేటి యువతులకు మీరు ఒక ప్రేరణ అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
గురువారం జరిగిన మహిళల 51కిలోల ఫైనల్ పోరులో యువ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0 తేడాతో గువో యి జువాన్(చైనీస్ తైపీ)పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్.. తుదిపోరులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆది నుంచే తనదైన రీతిలో పవర్ఫుల్ పంచ్‌లు విసురుతూ ముప్పేట దాడికి పాల్పడింది. చైనీస్ తైపీ బాక్సర్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. నిఖత్ విసిరిన క్లీన్ పంచ్‌లకు రిఫరీలు పూర్తి పాయింట్లతో మొగ్గుచూపారు. చైనీస్ తైపీ బాక్సర్ పుంజుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆధిక్యం దక్కించుకున్న నిఖత్ విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ నిజామాబాద్ బాక్సర్ సాధించిన తొలి మెగాటోర్నీ పతకం ఇదే.
Hearty congratulations to @nikhat_zareen on winning the Women’s 51 KG World Boxing Cup Finals 2025 title!
Your relentless hard work and indomitable spirit continue to make India and Telangana proud.
You are an inspiration to countless young girls who dare to dream big.… pic.twitter.com/ud21WBBaLX
— KTR (@KTRBRS) November 21, 2025