హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ మూసీపై ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, ధాన్యం కొనుగోళ్లపై మాత్రం వెనకడుగు వేస్తున్నదని విమర్శించారు. రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ కొనుగోలు సెంటర్లపై లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదు కానీ కాంగ్రెస్ కోతలకు లెక్క లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిర్వాకంతో మధ్య దళారులు బాగుపడుతుండగా, రైతన్నలు నష్టపోతున్నారని విమర్శించారు. తమ పాలనలో రూ.2300 క్వింటాలు అమ్మిన రైతు.. మీ పుణ్యమా అని నేడు రూ.1800లకు అమ్ముకుంటున్నాడని చెప్పారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘‘మూసి పై ముందుకు – కొనుగోళ్ళపై వెనక్కు
రామన్నపేట కు రైరై – కొనుగోలు సెంటర్లకు నై నై
దామగుండం ధనాధన్ – ధాన్యం కొనుగోళ్లు డాం డాం
కొనుగోళ్లకు దిక్కులేదు -కాంగ్రెస్ కోతలకు లెక్క లేదు
దళారులకు దండిగా – రైతన్నలకు దండగా
నాడు క్వింటాలుకు ₹ 2300 అమ్ముకున్న రైతు మీ పుణ్యమా నేడు ₹ 1800 లకు అమ్ముకోబట్టే
ఎద్దేడ్చిన వ్యవసాయం – రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మూసి పై ముందుకు – కొనుగోళ్ళపై వెనక్కు
రామన్నపేట కు రైరై – కొనుగోలు సెంటర్లకు నై నై
దామగుండం ధనాధన్ – ధాన్యం కొనుగోళ్లు డాం డాం
కొనుగోళ్లకు దిక్కులేదు -కాంగ్రెస్ కోతలకు లెక్క లేదు
దళారులకు దండిగా – రైతన్నలకు దండగా
నాడు క్వింటాలుకు ₹ 2300 అమ్ముకున్న రైతు మీ పుణ్యమా నేడు ₹… pic.twitter.com/hprp6vKCrG
— KTR (@KTRBRS) October 30, 2024