హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎందుకు సన్మానించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టబోమని చెప్పినందుకా?
అమృత్ కుంభకోణంలో నీ బావమరిదిని కాపాడుతున్నందుకా? పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో వివరాలు బయటకు రాకుండా చేసినందుకా? కేసులు పెట్టకుండా అడ్డుకున్నందుకా? అంటూ ఎక్స్‌వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.