హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అప్పులపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రతినెల అప్పుల వడ్డీ రూ పంలో రూ.2,300 కోట్లు మాత్రమే కడు తూ రూ.7 వేల కోట్లు చెల్లిస్తున్నామని పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని శనివా రం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. అ క్టోబర్లో కాగ్ ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ కాకి లెక్కల బండారాన్ని బట్టబయలు చేసిందని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే ప్రభుత్వ ఆదాయం, కొత్తగా తెచ్చిన అప్పులు సరిపోతున్నాయంటూ సీఎం, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగ్ తాజా లెక్కలు కొట్టిపారేశాయని గుర్తుచేశారు.
ఈ నివేదిక కాంగ్రెస్కు చెంపపెట్టని అభివర్ణించారు. తప్పుడు ప్రచారంతో ప్ర జలను, అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రెండేండ్లలో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన రూ.2.23 లక్షల కోట్ల రుణాలు ఎక్కడికిపోయాయి? సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకు బదులు స్కాంల కోసమే అప్పులు తెచ్చారా?’ అని ప్రశ్నించారు. రూ.2.23 లక్షల కోట్లు ఏయే పథకాలకు, ఏయే ప్రాజెక్టులకు ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాని, ఏడు నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
కాగ్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ వరకు సర్కారు కట్టిన వడ్డీ సగటున నెలకు రూ.2,361.41 కోట్ల చొప్పున రూ.16,529.88 కోట్లు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు. కాంగ్రె స్ నాయకులు మాత్రం 6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్లు అని తప్పుడు లెక్కలు చెప్తున్నారని మండిపడ్డారు. వారు చెప్తున్నదాంట్లో కట్టేది సగం కూడా లేదని చెప్పారు. అప్పుల పేరిట అబద్ధాలు చెప్తూ పాలనలో చేతగానితనాన్ని, అవినీతిని దాచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కారు అప్పుగా తెచ్చిన ప్రతి పైసాతో ఆస్తులు సృష్టించిందని తెలిపారు. కానీ రేవంత్ సర్కారు మాత్రం అప్పుల సునామీని సృష్టించి తెలంగాణను ఆర్థిక సంక్షోభంవైపు నడిపిస్తున్నదని నిప్పులు చెరిగారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెచ్చిన అప్పు రూ.2.80 లక్షల కోట్లేనని, ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్లో బయటపెట్టిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు 23 నెలల్లోనే రూ.2.30 లక్షల కోట్లు రుణం తెచ్చిందని వెల్లడించారు. నాడు తెచ్చిన అప్పులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి పథకాలకు, రోడ్ల నిర్మాణానికి ఖర్చుచేశామని పేర్కొన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం రెండేండ్లలో ఒక్క ప్రా జెక్టు కూడా నిర్మించకుండానే, ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే రూ.2.30 లక్షల కోట్ల అప్పులు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తెచ్చిన అప్పు లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి మూ టలు పంపుతున్నారా? అని ప్రశ్నించారు. అప్పుల పేరు చెప్పి హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు.