హైదరాబాద్: అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 330 రోజులు ముగిశాయని, ఏడాది నిండడానికి ఇంకా 35 రోజులే మిగిలిందన్నారు. కాంగ్రెస్ హామీలపై ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చెప్పిన హామీలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలాయని, చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలయ్యాయని మండిపడ్డారు. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో మూసీ సర్కార్ పబ్బం గడిపిందని విమర్శించారు. ఈ ప్రజా పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు తప్ప చెప్పుకోవడానికి ఏమున్నదని ప్రశ్నించారు.
“వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్.
మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!
ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది-2 లక్షల జాబ్ లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – పెంచిన రూ.4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-పెంచి ఇస్తామన్న రూ.6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యంగా అన్నలు,అక్కలు
ఏడాదికి 35 రోజులే మిగిలింది-ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ.12000 ఎక్కడ అంటున్నారు
ఏడాదికి 35 రోజులే మిగిలింది – తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు
చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే – చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే
ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసి సర్కార్
ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప?
జవాబు చెప్తావా ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
“వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారంటీ” అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్
మూడు వందల ముప్పై రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది!
❌ ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది-2 లక్షల జాబ్ లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు
❌ ఏడాదికి 35 రోజులే మిగిలింది -… pic.twitter.com/1g0O3FReHt
— KTR (@KTRBRS) November 3, 2024