హైదరాబాద్: కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నంలో విద్యార్థుల ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కేసీఆర్పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా అని ప్రశ్నించారు. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం చేస్తున్నదని నిలదీశారు. విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా అని, నిమ్స్ లో పేద పిల్లల హాహాకారాలు వినిపించడం లేదా మండిపడ్డారు. పది రోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమై… పేదల పిల్లలు గోడుగోడునా ఏడుస్తుంటే కనీసం సమీక్ష అయినా నిర్వహించావా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో మీరు పీకిందేమిటని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులను అవస్థలకు గురిచేశారన్నారు. గురుకులాలకు తాళం పడేలా చేశారని, ప్రాథమిక పాఠశాలలకు శీతాకాలంలోనే ఒంటిపూట పెట్టారని దుయ్యబట్టారు. సకల జనులను కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లు పెట్టిస్తున్నదని విమర్శించారు. మార్పుకు ఓటేసిన ఫలితం తెలంగాణను వెంటాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం…
విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం..కేసీఆర్ పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా సర్కార్ ఏం పొడుస్తున్నట్లు?విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి… pic.twitter.com/LzPM7xzouS
— KTR (@KTRBRS) November 7, 2024