KTR | మంత్రుల దగ్గర ఏ పని జరగాలన్నా.. ఏ ఫైల్ కదలాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎట్టకేలకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్ సర్కార్ నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. దురదృష్టవశాత్తూ ఇది బహిరంగంగా రహస్యంగానే ఉందని వ్యాఖ్యానించారు.
ఈ 30 శాతం కమీషన్ ప్రభుత్వంలో కమీషన్లు లేనిదే మంత్రులు ఏ ఫైల్ మీద సంతకం పెట్టడం లేదని మంత్రి కొండా సురేఖ బహిరంగంగానే చెప్పారని కేటీఆర్ అన్నారు. సచివాలయం ముందే కాంట్రాక్టర్లు ధర్నాకు దిగడం ఈ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తుందని చెప్పారు. మంత్రి కొండా సురేఖ తెగించి కమీషన్లు తీసుకుంటున్న మంత్రుల పేర్లను బయటపెట్టాలని కోరారు. మంత్రి కొండా సురేఖ చేసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించగలరా అని రేవంత్ రెడ్డి, రాహుల్‌గాంధీని ప్రశ్నించారు.
రేవంత్ పాలనలో మంత్రుల వద్ద ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా ముడుపులు అందాల్సిందేనని స్వయంగా బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ!
“కాంగ్రెస్ అంటేనే అవినీతి” అని ఒప్పుకున్న మంత్రి. pic.twitter.com/nF6Csnfzpr
— BRS Party (@BRSparty) May 16, 2025