హైదరాబాద్: బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. వీరుడిగా, సంఘసంస్కర్తగా, దార్శనికుడిగా, వైతాళికుడిగా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.
తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి సంత్ సేవాలాల్ మహారాజ్ కలలుగన్న తండా రాజ్యాన్ని కేసీఆర్ నిజం చేశారని తెలిపారు. భారతదేశ ప్రజల కోసం తన జీవితాన్ని ధారబోసిన సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తిస్తూ.. హైదరాబాద్లో సేవాలాల్ మహారాజ్ పేరిట బంజారా భవనాన్ని నిర్మించారని వెల్లడించారు. సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధులు కేటాయించి.. వారి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుని వారిని గౌరవించుకున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు.
‘బంజారాల్లో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని, దేశభక్తిని నింపిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్. తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి సంత్ సేవాలాల్ మహారాజ్ కలలుగన్న తండా రాజ్యాన్ని కేసీఆర్ గారు నిజం చేశారు. భారతదేశ ప్రజల కోసం తన జీవితాన్ని ధారబోసిన సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తిస్తూ.. హైదరాబాద్ నగరంలో సేవాలాల్ మహారాజ్ పేరిట బంజారా భవనాన్ని కేసీఆర్ గారు నిర్మించారు. సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధులు కేటాయించి.. వారి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుని వారిని గౌరవించుకున్నాం. వీరుడిగా, సంఘసంస్కర్తగా, దార్శనికుడిగా, వైతాళికుడిగా ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.