హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులకు కేటీఆర్ సన్మానం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో జెండా ఎగరవేసిన కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు pic.twitter.com/UeoOKdjq6Z
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026