నోట్లపై మోదీ బొమ్మ ముద్రిస్తారేమో?:కేటీఆర్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇస్తే నోట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ముద్రించే అవకాశాలు ఉన్నాయని మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ఎల్జీ వైద్య కళాశాల పేరును నరేంద్ర మోదీ కాలేజీగా మార్చారని, గతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్లో గుర్తుచేశారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో నోట్లపై గాంధీజీ బొమ్మ స్థానంలో ప్రధాని మోదీజీ బొమ్మను ముద్రించాలని ఆర్బీఐని ఆదేశించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వాతావరణ మార్పులతో తక్షణ ముప్పు పొంచి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. వాతావరణంలో తరచూ మార్పులు జరగకుండా సమతుల్యంగా ఉండాలన్నా, భూమిని రక్షించుకోవాలన్నా.. తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం తరహా కార్యక్రమాలు చేపట్టాలని ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP Govt
- Currency Notes
- KTR
- mocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

