హైదరాబాద్ : అక్రమ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ములాఖత్‌లో కలిశారు. కేటీఆర్‌తోపాటు తలసాని శ్రీనివాస్, సుధీర్‌రెడ్డి ఉన్నారు. కాగా, సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలని చెప్పారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ చేశారు.
గతనెల 26న బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లిలోని సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.