KTR | ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలోఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు.
అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చించారు. స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపల్) ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
✳️ నంది నగర్ నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ జిల్లాలో పార్టీ బలోపేతం, రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చ
♦️దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)… pic.twitter.com/MXZXSesCyW
— BRS Party (@BRSparty) May 2, 2026